ఇప్పటివరకు వచ్చిన రాజమౌళి చిత్రాల్లోని పాటలను మించేలా సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి ఒక ఛాలెంజ్‌గా ఈ చిత్రంలోని పాటలను రూపొందించారు. అలాగే చిత్రానికి ప్రాణంలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా కీరవాణి ఎక్కడా రాజీపడకుండా తనదైన శైలిలో చేస్తున్నారు. ఇదిలా వుండగా ఈ చిత్ర ఆడియో ని ఈ నెల 31న విడుదల చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా మరో సంచలన న్యూస్ మీకు మీము ప్రత్యకంగా అందిస్తున్నాం. ఈ చిత్ర ఆడియో సి.డి ని విడుదలకు ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకునే అవకాశాన్ని ఏర్పాటు చేసారు చిత్ర యూనిట్. అమజాన్ సైట్ లో బాహుబలి చిత్ర ఆడియో సి.డి ని మీరు ముందే బుక్ చేసుకొని సాంగ్స్ వినే అవకాశం కల్పించారు. లహరి మ్యూజిక్ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బాహుబలి’ ఆడియోను విడుదల చేస్తోంది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆడియోకీ లభించని భారీ ఆఫర్‌ని ‘బాహుబలి’ ఆడియోకు ఇచ్చి తెలుగు, తమిళ్ ఆడియో రైట్స్ తమ సొంతం చేసుకున్నారు. అలాగే ఈ ఆడియో లైవ్ టెలికాస్ట్ ని కూడా భారీ అమౌంట్ తో రైట్స్ ని సొంతం చేసుకున్నారు tv 5 వారు. ఇంకెందుకు ఆలస్యం ఈ లింక్ క్లిక్ చేసి బాహుబలి ఆడియో సి.డి ని సొంతం చేసుకోండి–> http://amzn.to/1LEBeff