ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘బాహుబలి 2’ ఫీవర్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది మరో ప్రత్యక్ష ఉదాహరణ. దేశ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఐపీఎల్ 10వ సీజన్ మ్యాచ్‌ల మద్యలో ‘బాహుబలి 2’ యాడ్ ప్రసారం అవుతుంది. ఒక జాతీయ ఛానెల్లో తెలుగు సినిమా యాడ్ ప్రసారం అవ్వడం ఇదే ప్రథమం. సోని సిక్స్‌లో ఈ సినిమాకు సంబంధించిన యాడ్స్ ప్రసారం చేస్తూ జాతీయ స్థాయిలో ఈ సినిమాకు పబ్లిసిటీ చేస్తున్నారు.
ఇప్పటికే ‘బాహుబలి’తో తెలుగు సినిమాకు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో యాడ్స్‌ను ప్రసారం చేయడంతో మరింతగా ‘బాహుబలి 2’కు ప్రచారం దక్కింది. ఒక సౌత్ సినిమాకు గతంలో ఎప్పుడు లేనంతగా భారీ పబ్లిసిటీని ఉత్తరాదిన ‘బాహుబలి 2’ కోసం చేస్తున్నారు. బాహుబలి సినిమాల స్థాయిలో అక్కడ పబ్లిసిటీ చేస్తున్నారు. కరణ్ జోహార్ ప్రమోషన్ ప్లాన్‌తో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది.