Site icon TeluguMirchi.com

గుడ్ న్యూస్ : బాహుబలి 2 రోజుకు 6 షోస్..

Umar-review-baahubali2

ప్రభాస్ అభిమానులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి లేదు..రెండేళ్లు గా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి 2 ఈ నెల 28 తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోవడం తో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఇండస్ట్రీ వారే కాక సినీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆతృతగా ఉన్నారు..ఈ ఆతృతను చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో బాహుబలి-2 చిత్రాన్ని పది రోజుల పాటు రోజుకు 6 ఆటలు ప్రదర్శించుకునేందుకు అనుమతిచ్చింది.


ఈ నెల 28 నుంచి మే ఏడు వరకూ ఇది అమల్లో ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 2.30 గంటల వరకూ సినిమాను ప్రదర్శించుకోవచ్చు. జనం రద్దీ, బ్లాక్‌ టిక్కెట్ల విక్రయాల నియంత్రణ, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చేయడానికి ఈ అనుమతి ఇచ్చినట్లు హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధ ఉత్తర్వుల్లో జారీ చేసారు..ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరు షో లకు అనుమతి ఇస్తే బాగుండు అని ఇక్కడి ప్రేక్షకులు భావిస్తున్నారు.

Exit mobile version