Site icon TeluguMirchi.com

బాహుబలి 3 డేస్ కలెక్షన్ల వివరాలు..

రాజమౌళి తెరకెక్కించిన వెండి తెర అద్భుత దృశ్య కావ్యం బాహుబలి 2 ..విడుదలైన అన్ని థియేటర్స్ లలో కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది..విడుదలై నాలుగు రోజులు అవుతున్న ఇంకా టికెట్స్ దొరకని పరిస్థితి…బాహుబలి కి వస్తున్న కలెక్షన్స్ , పేరు చూసి హాలీవుడ్ దర్శకులు ఆశ్ఛర్య పోతున్నారు.. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ..ప్రపంచవ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే రూ.505 కోట్ల పైనే గ్రాస్‌ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నమోదు చేసింది.

ఇండియా లో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ విడుదలైన అన్ని భాషల్లో కలిపి రూ.385కోట్లు, విదేశాల్లో రూ.120 కోట్ల వసూళ్లు సాధించింది. హిందీలో తొలి మూడు రోజులకు రూ.128 కోట్లు రాబట్టి అక్కడి ఖాన్ లను సైతం పక్కకు నెట్టింది. ‘దంగల్‌’ (రూ.107.01 కోట్లు), సుల్తాన్‌ (రూ.105.53 కోట్లు) రికార్డుల్ని ఈజీ గా దాటేసి తెలుగోడి సత్తా అంటే ఎలా ఉంటుందో రుచి చూపించింది.

బాహుబలి కి వస్తున్న రెస్పాన్స్ పట్ల రాజమౌళి తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ‘‘బాహుబలి 2’ విడుదలకు కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. అభిమానుల ప్రేమ వాటిని అధిగమించేలా చేసింది. ఐదేళ్ల ‘బాహుబలి’ ప్రయాణంలో ప్రతి దశలోనూ మాకు తోడుగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు. జీవితాంతం మా గుండెల్లో దాచుకునేటంత గొప్ప విజయాన్ని అందించారు’’ అని తెలిపారు.

Exit mobile version