బాహుబలి 2 మొత్తం నెట్ లో పెట్టేసాడు.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించింది..అభిమానుల పెట్టుకున్న అంచనాలను మించి సినిమా ఉండడం తో వారి సంబరాలు మాములుగా లేవు..ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 9 వేల థియేటర్స్ లలో నాల్గు భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యం లో పైరసీ రాకాసి బాహుబలి కి పెద్ద దెబ్బ గా మారింది. దర్శక నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న పైరసీ ఆపడం లో మాత్రం ఏం చేయలేకపోతున్నారు.

‘బాహుబలి 2’ చిత్రం తాజాగా పైరసీ బారిన పడింది. కువైట్‌కు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఈ సినిమాను లీక్‌ చేశాడు. ‘బాహుబలి 2’ చిత్రం భారత్‌లోకంటే ఒక్క రోజు ముందే యూఏఈలో విడుదలైంది. అక్కడ చిత్రాన్ని చూసిన కువైట్‌ ప్రేక్షకుడు ఫేస్‌బుక్‌లో దాదాపు గంట సేపు సినిమాను ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఇలాంటివి కొత్తమీ కాదు గతం లో చాల చిత్రాలు ఇలా లైవ్ లో లీక్ చేయడం జరిగింది. బాహుబలి 2 ను ఒక్కరోజులోనే ఆ పైరసీ వీడియోను 2.5 లక్షల మంది చూశారు.