బాహుబలి వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

ఏప్రిల్ 28 యావత్ సినీ ప్రపంచం మరచిపోలేని రోజు..తెలుగు సినిమా సత్తా ను ఏకంగా ప్రపంచం మొత్తం మాట్లాడుకునే రోజు అయ్యింది..దర్శక ధీరుడు రాజమౌళి వెండి తెర ఫై సృష్టించిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి 2 . ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9వేల స్క్రీన్స్ పై అట్టహాసంగా విడుదలైన బాహుబలి ది కంక్లూజన్ సినిమా మొదటి రోజు వసూళ్ళలో కొత్త రికార్డ్స్ సృష్టించింది.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే క్యూరియాసిటీ, కనీవినీ ఎరుగని రీతిలో చేసిన పబ్లిసిటీ, పార్ట్-1 సృష్టించిన ప్రభంజనం.. ఇలా అన్నీ కలిసి బాహుబలి-2 చిత్రాన్ని ఎవరెస్ట్ శిఖరంపై నిలబెట్టాయి. ఇంత భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఈ దశాబ్ద కాలంలో ఇంకోటి లేదనే చెప్పాలి. బాహుబలి-2 సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచి 50కోట్ల రూపాయల వసూళ్లు చేయగా, అటు ఓవర్సీస్ లో ఈ సినిమా 3 మిలియన్ క్లబ్ లోకి చేరిపోయింది. గురువారం ప్రివ్యూస్ కే అమెరికా, కెనడా దేశాల్లో ఈ సినిమాకు 2.5 మిలియన్ డాలర్లు వచ్చాయి.

బాలీవుడ్ లో ఈ సినిమాకు తొలిరోజు 40కోట్ల రూపాయలు వచ్చాయి. వీటితో పాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా బాహుబలి-2 సినిమా భారీ ఎత్తున విడుదలైంది. ఓవరాల్ గా బాహుబలి 2 ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ దాదాపు రూ. 150 కోట్ల కు చేరువయ్యింది.