Site icon TeluguMirchi.com

ఫస్ట్ డే టార్గెట్ రూ.100 కోట్లు..?

Baahubali-1st-day

ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు రాని క్రేజ్ బాహుబలి 2 కు వచ్చింది..దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులు బాహుబలి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 6500 థియేటర్స్ లలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.. ప్రస్తుతం ఉన్న క్రేజ్‌ను బట్టి బాహుబలి 2 ఫస్ట్ డే నుండే రికార్డులు తిరగరాస్తుందనే నమ్మకం అందరిలో కనిపిస్తోంది. ఇక అభిమానులు అయితే ఫస్ట్ డే రూ. 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు.

బాహుబలి పార్ట్1 మొదటిరోజు దాదాపు యాభై కోట్లు వరకు వసూళ్లు రాబట్టింది. రెండు రోజులకి కలిపి వంద కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఇప్పుడు బాహుబలి2 ఒక్కరోజులోనే 100 కోట్లు కలెక్షన్స్ సాధించే అవకాశాలు నిండుగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం బెనిఫిట్ షోతో కలిపి ఆరు షోలు వేయడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో సినిమా విడుదలవుతోంది. కాబట్టి తొలిరోజు అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని అంత ఫిక్స్ అయ్యారు. ఆ రికార్డ్స్ ఏంటో మరో ఐదు రోజుల్లో తేలిపోనుంది.

Exit mobile version