తాజాగా వాట్సప్‌లో తమిళ వర్షన్‌కు సంబంధించిన క్లిప్పింగ్ ఒకటి తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో ప్రస్తుతం ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది. తమిళ వర్షన్ సెన్సార్ సందర్బంగా బోర్డు సభ్యులు ఎవరో మొబైల్‌లో కొన్ని సెకన్ల పాటు చిత్రీకరించి దాన్ని వాట్సప్‌లో షేర్ చేయడం, అది ప్రస్తుతం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, అటు నుండి దేశం, విదేశాల్లో కూడా చక్కర్లు కొడుతుంది. ఆ లీక్ అయిన వైరల్ వీడియో ఏంటి అనేది మేము చెప్పం, కాని దాన్ని చూసి షాక్ అయ్యాం మాత్రం చెప్పగలం. ఆ విషయం తెలిస్తే సినిమాపై మరింత ఆసక్తి కలగడం మాత్రం ఖాయం. మరి కొన్ని గంటల్లో సినిమా విడుదల కాబోతుండగా ఆ చిన్న వీడియో చూడటం ఎందుకు, పూర్తి సినిమా చూసి ఎంజాయ్ చేయండి.