బాహుబలి దొంగలు దొరికారు

పైరసీ భూతం సినీ పరిశ్రమను వెంటాడుతోంది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా పైరసీని ఆపడం సాధ్యపడటం లేదు. ఎంత అప్రమత్తంగా వుంటున్నా ఏదో మార్గంలో పైరసీ చేసుకొని డబ్బులు కూడా బెట్టుకుంటున్నారు నేరగాళ్ళు.

బాహుబలి2 కి కూడా పైరసీ భూతం వెంటాడింది. బాహుబలి-2 పైరసీ సీడీలు తయారుచేసి, విక్రయిస్తున్న దుకాణాలపై టాస్క్‌ఫోర్సు పోలీసులు దాడులు జరిపారు. బాహుబలి-2 సినిమాకు సంబంధించిన చిత్రాల పైరసీ సీడీలు విరివిగా లభిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో టాస్క్‌ఫోర్సు సిబ్బంది నగరంలోని పలు వీడియో దుకాణాలపై దాడులు జరపగా, అక్కడ 189 పైరసీ సీడీలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో బాహుబలి, బాహుబలి-2 హిందీ వెర్షన్‌ సీడీలుతో పాటు కాటమరాయుడు, ధ్రువ, రోగ్‌, ఘాజీ, చెలియా, శివలింగ తదితర సీడీలు స్వాధీనం కూడా చేసుకున్నారు.