Site icon TeluguMirchi.com

బాహుబలి సర్వర్ ఎక్కడ వుందో తెలుసా ?

baahubali-mistak

బాహుబలి కోసం రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన అనుమతి లేకుండా ఈ సినిమాకి సంబధించిన ఒక్క లొకేషన్ స్టిల్ కూడా బయటికిరాలేదు. అలాగే పుటేజ్ ను కూడా ఎడిట్ రూమ్ లో పెట్టలేదు. దానికి కోసం అమెరికా నుండి ఒక అధునూతన డాటా స్టోరేజ్ పరికరాన్ని దిగుమతి చేసుకొని ఫింగర్ ప్రింట్ స్కేనర్ లో లాక్ చేశారు.

‘బాహబులి: ది కంక్లూజన్’ కోసమైతే జర్మనీలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేసిందట చిత్ర బృందం. ప్రపంచవ్యాప్తంగా 36 స్టూడియోల్లో ఈ సినిమా వీఎఫెక్స్ పనులు జరిగాయట. దీనికోసం జర్మనిలో స్పెషల్ సర్వర్ ను ఏర్పాటు చేశారు. బాహుబలి టీం నుంచి అనుమతి ఉన్న వీఎఫ్ ఎక్స్ నిపుణులు లాగిన్ అయితేనే ఈ కంటెంట్ ను చూడగలరు. ఎప్పుడు ఎవరు లాగిన్ అయ్యారు.. ఏం చేశారు అన్నది ఎప్పటికప్పుడు బాహుబలి వీఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ కమల్ కణ్ణన్ తో పాటు రాజమౌళి లు అలర్ట్ చేసే ఆప్షన్ పెట్టారట. అలాగే వీరి అనుమతి లేనిదే కాపీ పేస్ట్ డీలీట్ ఆప్షన్ ను ఓపెన్ చేయడానికి వీలులేకుండా చూశారట. మొత్తంమ్మీద చాలా పగడ్బందీగా జరిగాయి బాహుబలి పనులు.

Exit mobile version