బాహుబలి ప్రీమియర్ షో వేసిన రోజే షూట్ చేసి నెట్ లో పెట్టేశారు. అంతే కాకుండా వాట్సాప్ లో కూడా ఈ వీడియో హల్ చల్ చేస్తుంది. నిన్న సాయంత్రం ప్రదర్శించిన బెనిఫిట్ షోలోనే 50నిముషాలు రికార్డ్ చేసి నెట్ లో పెట్టారని అంతే కాకుండా దానికి డౌన్ లోడ్ ఆప్షన్ కూడా ఇచ్చేసారని బాహుబలి సినిమా బృందం పోలీసులకు పిర్యాదు చేసింది. ఇక ఈ వీడియో ఉన్న వెబ్ సైట్ లను కనిపెట్టే పనిలో పడ్డారు పోలీసులు. అంతే కాకుండా ప్రభాస్ అభిమానులు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐదేళ్ల శర్మ ఇలా పైరసీ తో వృధా కాకూడదని వాళ్ళు కూడా రంగం లోకి దిగారు.