ఘోరం : బాహుబలి పైరసీ అప్పుడే వచ్చేసిందా..?

రెండేళ్లు గా అభిమానులు , సినీ లోకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బాహుబలి 2 అర్ధరాత్రి నుండే థియేటర్స్ లలో సందడి మొదలు పెట్టింది..తెలుగు రాష్ట్రాల తో పాటు చాల చోట్ల ప్రీమియర్ షోస్ పడ్డాయి..అనుకున్నదానికంటే సినిమా 100 రేట్లు అంచనాలు మించే విధంగా ఉండడం తో అభిమానుల ఆనందాలు మాములుగా లేవు..ఇక దేశ వ్యాప్తంగా బాహుబలి మేనియా నడుస్తుంటే..పైరసీ రాయుళ్లు తమ చేతులకు పని చెప్పారు..

బాహుబలి ప్రీమియర్ షో వేసిన రోజే షూట్ చేసి నెట్ లో పెట్టేశారు. అంతే కాకుండా వాట్సాప్ లో కూడా ఈ వీడియో హల్ చల్ చేస్తుంది. నిన్న సాయంత్రం ప్రదర్శించిన బెనిఫిట్ షోలోనే 50నిముషాలు రికార్డ్ చేసి నెట్ లో పెట్టారని అంతే కాకుండా దానికి డౌన్ లోడ్ ఆప్షన్ కూడా ఇచ్చేసారని బాహుబలి సినిమా బృందం పోలీసులకు పిర్యాదు చేసింది. ఇక ఈ వీడియో ఉన్న వెబ్ సైట్ లను కనిపెట్టే పనిలో పడ్డారు పోలీసులు. అంతే కాకుండా ప్రభాస్ అభిమానులు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐదేళ్ల శర్మ ఇలా పైరసీ తో వృధా కాకూడదని వాళ్ళు కూడా రంగం లోకి దిగారు.