Site icon TeluguMirchi.com

బాహుబలి 2 50 డేస్ ఎన్ని సెంటర్లలో తెలుసా..?

ఒకప్పుడు 50 రోజుల సెంటర్లు , 100 రోజుల సెంటర్లు అని అభిమానులు , హీరోలు గొప్పగా చెప్పుకునే వారు..కానీ గత రెండేళ్లు గా 50 రోజులు , 100 రోజులు అనేవి పోయాయి..ఏ గొప్ప చిత్రమైన పట్టుమని 10 రోజులు థియేటర్స్ లలో సందడి చేయలేకపోతున్నాయి. అలాంటిది బాహుబలి 2 మరో రెండు రోజుల్లో 50 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఏప్రిల్ 28న విడుదలైన బాహుబలి2.. జూన్ 16తో దిగ్విజయంగా 50 రోజుల పండుగను పూర్తి చేసుకుంటోంది.

ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్స్ సృష్టించిన చిత్రంగా బాహుబలి 2 నిలిచిన సంగతి మళ్లీ చెప్పాల్సిన పని లేదు.. కేవలం ఇండియా నుంచే ఈ చిత్రానికి 1200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయంటే సినిమా ఎలా ఉందో..ఆడిందో చెప్పవచ్చు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శించబడుతుందని సమాచారం. అలాగే దేశవ్యాప్తంగా 1000కి పైగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బాహుబలి 2 50 డేస్ స్పెషల్ పోస్టర్లను విడుదల చేశారు.

Exit mobile version