Site icon TeluguMirchi.com

‘ బాహుబలి ‘ హిందీ వర్షన్ 4 డేస్ కలెక్షన్స్..

బాహుబలి: ది కన్‌క్లూజన్‌..ఈ చిత్రం ఇప్పుడు యావత్ సినీ విమర్శకులను సైతం అయోమయం లో పడేసింది..హిట్ అవుతుందని అందరికి తెలుసు కానీ ఈ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని , ఇండియన్ సినీ చరిత్రలోనే ఖాన్ ల రికార్డ్స్ సైతం అడ్రెస్ లేకుండా చేస్తుందని ఎవరు ఊహించలేదు…

ముఖ్యంగా హిందీ వెర్షన్ బాహుబలి వసూళ్లు అయితే పెద్ద షాక్ ఇస్తున్నాయని చెప్పొచ్చు. ఈ చిత్రం ఇండియాలో సాధించిన గ్రాస్ లో 40 శాతం హిందీ భాషలోనే కావడం విశేషం. సాధారణంగా ఎంత గొప్ప సినిమాకైనా ఓపెనింగ్ రోజు దక్కినన్ని కలెక్షన్లు రెండు, మూడవ రోజుల్లో రావడమంటే పెద్ద విశేషమే.అలాంటిది బాహుబలి నాల్గవ రోజు కూడా మొదటి రోజు వచ్చిన వసూళ్లను రాబట్టింది.

బాలీవుడ్ లెక్కల ప్రకారం

ఫస్ట్ డే —> రూ. 41 కోట్లు
సెకండ్ డే —-> రూ. 40.5 కోట్లు
థర్డ్ డే —> రూ. 46.5 కోట్లు
ఫోర్త్ డే —> రూ. 40.25 కోట్లు రాబట్టి మొత్తం నాల్గు రోజుల్లో రూ. 168.25 కోట్లు వసూళ్లు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Exit mobile version