Site icon TeluguMirchi.com

బాహుబలి 2 ఫస్ట్ వీక్ బాలీవుడ్ కలెక్షన్స్

బాహుబలి 2 రిలీజ్ ముందు ఎలా అంత మాట్లాడుకున్నారో..రిలీజ్ తర్వాత కూడా అదే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు.ఒక్క భాష లో మాత్రమే కాదు అన్ని భాషల్లో బాహుబలి 2 కలెక్షన్స్ గురించి చాల గొప్పగా చెప్పుకుంటున్నారు. ఓ తెలుగు సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో అగ్ర స్థానాన్ని సాధించడం చాల గొప్ప విషయం..కేవలం మొదటి వారం లో దాదాపు ప్రపంచ వ్యాప్తంగా రూ. 850 కోట్లు సాధించడం , అలాగే దేశ వ్యాప్తంగా రూ. 534 కోట్లు వసూలు చేసి.. తొలివారం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

హిందీ లో బాహుబలి రోజు వారి వసూళ్లు ఎలా ఉన్నాయంటే..

* తొలిరోజున (శుక్రవారం) రూ. 41 కోట్లు
* శనివారం రూ. 40.50 కోట్లు
* ఆదివారం రూ. 46.50 కోట్లు
* సోమవారం రూ. 40.25
* మంగళవారం రూ. 30 కోట్లు
* బుధవారం రూ. 26 కోట్లు
* గురువారం రూ. 22.75 కోట్లు

మొత్తం రూ. 247 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది.

గతంలో (హిందీ) ‘దంగల్‌’ ఏడు రోజుల్లో రూ. 197.54 కోట్లు, ‘సుల్తాన్‌’ తొమ్మిది రోజుల్లో రూ. 229.16 కోట్లు వసూలు చేయగా.. ‘బాహుబలి 2’ ఏడు రోజుల్లో రూ. 247 కోట్లు రాబట్టి నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది.

Exit mobile version