ప్రేమ కోసం రెబల్ లవర్


బాలీవుడ్ నటుడు టైగర్‌ష్రాఫ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బాఘీ 2’. అహ్మద్‌ఖాన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇందులో ఆయన సిక్స్‌ ప్యాక్ ‌బాడీతో గన్‌ పట్టుకుని వస్తుండగా, వెనుక హెలికాప్టర్‌ కూలిపోతున్న స్టిల్‌ ఆకట్టుకుంటోంది. ‘రెబల్‌ ఫర్‌ లవ్‌’ అని పోస్టర్‌పై రాశారు. ఇందులో దిశా పటాని కథానాయిక.

బాఘి సినిమాను తెలుగులో వచ్చిన ‘వర్షం’ సినిమాకి రీమేక్‌గా తీసినా.. అందులో కేరళలో ప్రసిద్ధిచెందిన కళరిపాయట్టు నేపథ్యంలో యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కించారు. ఇప్పుడు బాఘి-2 ఫస్ట్‌లుక్‌ చూస్తే ఈ సినిమా యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎవరి ప్రేమ కోసం టైగర్‌ యుద్ధం చేశాడో తెలియాలంటే సినిమా వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.