Site icon TeluguMirchi.com

బాద్ షా కథ అది కాదు … ఉత్తినే !

NTR_Baadshahఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బాద్‌షా’. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తి కరమైన అంశం చోటు చేసుకుంది. ఈ చిత్రం స్టోరీ లీకైందంటూ గత కొద్ది రోజులుగా నెట్ లో ఓ కధ హల్ చల్ చేస్తుంది. ఈ కథ ప్రకారం .. స్పెయిన్ లో మాఫియా లీడర్ ముఖేష్ కొడుకు నవదీప్… కాజల్ తో ప్రేమలో పడతాడు. అయితే కాజల్ గురించి పూర్తి సమాచారం సేకరించమని డిటెక్టివ్ ఏజన్సీని సంప్రదిస్తాడు. అక్కడ డిటెక్టివ్ మరెవ్వరో కాదు ఎన్టీఆర్. అక్కడ నుంచి ఎన్టీఆర్..కాజల్ వెనక పడుతూ ఉంటాడు. మరో ప్రక్క చదువు పూర్తిచేసుకున్న కాజల్.. ఇండియాకు చేరుకుంటుంది. ఆమెతో పాటు నవదీప్ ఖర్చుతో ఎన్టీఆర్ కూడా ఇండియాకు చేరుకుంటాడు. ఇండియాలో ఆల్రెడీ కాజల్ ని అజయ్ ప్రేమిస్తూంటాడు. అతను ఆమెపై యాసిడ్ దాడికి ప్రయత్నిస్తాడు. ఆ దాడి నుంచి రక్షించిన ఎన్టీఆర్ ఆమెకు దగ్గరవుతాడు. అయితే ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ ఎన్టీఆర్ మాఫియాకు చెందిన వాడని. ఇదిలా ఉండగా ఇండియాలో ఉన్న కాజల్ తల్లితండ్రలు ఆమెను సిద్దార్దకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేసాడు..అసలు ఎన్టీఆర్ ఈ డిటెక్టివ్, మాఫియా గెటప్ ల వెనక ఉన్న మర్మమేమిటి అనేది మిగతా కథ.

ఈ స్టోరీ బాగానే వుంది. అయితే ఇది అసలు కథ కాదు, ఒరిజినల్ కథ వేరే వుందని ‘బాద్ షా’ చిత్రం రచయితల్లో ఒకరైన కోన వెంకట్ ట్విట్టర్ లో మండిపడ్డారు. కోన వెంకట్ ట్వీట్ చేస్తూ …” నేనూ, గోపీ మోహన్ రాసిన బాద్ షా కథ 100% ఒరిజనల్ . ఆ కథ ఎక్కడనుంచి కాపీ చెయ్యలేదు. నెట్ లో వున్న బాద్ షా స్టొరీ రూమర్. మార్కెట్ లో ఉన్న బాద్ షా స్టోరీ పై ఉన్న రూమర్స్ అన్నీ చదివాను. అవి నిజానికి అంత బ్యాడ్ గా లేవు. మొదటిసారి రూమర్స్ లో కూడా క్రియేటివిటీ కనపడింది.” అన్నారు.

అయితే ఈ చిత్రం అసలు కథ తెలియాలంటే ఏప్రిల్ 5 వరకూ ఆగాల్సిందే. శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశ కు వచ్చింది. ఇటీవలే స్పెయిన్, స్విట్జర్లాండ్లో రెండు పాటలు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. డబ్బింగ్, ఎడిటింగ్ పనులన్నీ శబ్దాలయ స్టూడియోలో జరుగుతున్నాయి. ఈరోజు నుండి బాలన్స్ టాకీ పార్ట్ షూట్ చేయనున్నారు. మార్చ్ 10న భారీ ఎత్తున ఆడియో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది.

Exit mobile version