బాద్‌ షా 155 నిమిషాలుగా డిసైడయ్యాడు

jr_ntr_baadshah_తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇంతగా పబ్లిసిటీ ఏ సినిమాకూ ఇచ్చుండరేమో అనేలా నిర్మాత బండ్ల గణేశ్‌.. ఎన్టీయార్‌ హీరోగా శీనువైట్ల దర్శకత్వంలో నిర్మించిన బాద్‌ షా చిత్రానికి దాదాపుగా రోజుకో అప్డేట్‌ చొప్పున లీక్‌ చేస్తూ చిత్ర విచిత్రమైన ఓబ్లిసిటీ ఇస్తూ వచ్చాడు. ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ గా నిలిస్తే మాత్రం అందులో సగ భాగం క్రెడిట్‌ తనకిచ్చెయ్యాల్సిందే అన్నంతగా ఆ చిత్రం మేకింగ్‌ లో మునిగాడు గణేశ్‌. మొత్తం మీద సినిమా దాదాపుగా పూర్తయిపోయింది. ఫైనల్‌ గా బాద్‌ షా సినిమా నిడివి 2 గంటల 35 నిమిషాలుగా నిర్ణయించినట్టు నిర్మాత గణేశ్‌ తెలిపారు. ఎన్టీయార్‌ సరసన్‌ కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటించిన ఈ చిత్రంలో నవదీప్‌ నెగెటివ్‌ రోల్‌ ప్లే చేస్తుండగా, మరో హీరో సిద్దార్థ అతిథిపాత్రలో కనిపించబోతున్నాడు. మరో స్పెషల్‌ అట్రాక్షన్‌ గా మహేశ్‌ ఈ సినిమాకు తన గొంతును అరువిచ్చాడు. తమిళ హీరో శింభు, దలేర్‌ మెహెందీ, బాబా సెహగల్‌ లు తలో పాట పాడిన ఈ సినిమా ఆడియో తమన్‌ స్వరకల్పనలో ఇటీవలే విడుదలయి ఈ పాటలు మార్కెట్ లో కేక పుట్టిస్తున్నాయి.