ఏప్రిల్ 5న ‘బాద్ షా’

BADSHAHజూనియర్ ఎన్టీఆర్, శీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘బాద్ షా’ విడుదల తేది ఖరారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. ఈ మేరకు జరిగిన మీడియా సమావేశం లో హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “శ్రీను వైట్ల అద్భుతమైన సబ్జెక్ట్ చేశారు. ప్రేక్షకులు, నా అభిమానులు నన్ను ఎలాంటి పాత్రలో అయితే చూడాలనుకుంటారో… సరిగ్గా అలాంటి పాత్రలో నటిస్తున్నాను. నా పాత్ర, లుక్ చాలా స్టయిలిష్ గా వుంటాయి. నా కెరీర్లో మరో సెన్సేషనల్ హిట్ సినిమా అవుతుంది” అని తెలియజేశారు. దర్శకుడు వైట్ల మాట్లాడుతూ …ఎన్టీఆర్ ఇమేజ్ కి అనుగుణంగా వుంటూనే, సినిమా సరికొత్తగా అలరిస్తుందని, ఇందులో ఓ కొత్త ఎన్టీఆర్ కనిపిస్తారనీ అని అన్నారు. ఇక ఈ చిత్రం ఆడియో ను మార్చి 10న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. ఎన్టీఆర్ సరసన కాజల్ నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ తమన్.