Site icon TeluguMirchi.com

‘బాద్ షా’ కు యు/ఎ సర్టిఫికేట్

baadshahయంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘బాద్ షా’ ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ‘బాద్ షా’ కు సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. భారీ కమర్షియల్ హంగులున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. డైరెక్టర్ శ్రీను వైట్ల బాద్ షా ను స్టైలిష్ గా తీర్చిదిద్దాడు. ఇక నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాడు. మంచి ‘దూకుడు’ పై వున్న రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ ఈ చిత్రానికి కధ ను సమకూర్చగా తమన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రంలోని పాటలు మార్కెట్ లో ‘బాద్ షా’ కు మొదటి విజయాన్ని అందిచాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణలు ముఖ్య పాత్రలలో కనిపిస్తారు. ఇక ‘బాద్ షా’ డిసైడ్అయ్యాడు.. వార్ ఏ రేంజ్ లో వుంటుందో.. తెలియాలంటే ఏప్రిల్ 5వరకు ఆగాల్సిందే.

Exit mobile version