Site icon TeluguMirchi.com

బాద్ షా కామెడీ అదిరిపోయింద‌ట‌

baadshahసాధార‌ణంగా శ్రీ‌నువైట్ల సినిమాల్లో కామెడీ ఓ రేంజులో ఉంటుంది. వెంకీ, దుబాయ్ శీను, రెడీ, ఢీ, దూకుడు… ఈ సినిమాల విజ‌యాల్లో కామెడీ వాటానే ఎక్కువ‌. శ్రీ‌ను వైట్ల బ‌లం… వినోదం. దాన్ని బాద్‌షాలో కూడా రిపీట్ చేశార‌ట‌. బాద్‌షా ట్రైల‌ర్లు మాసీగా, యాక్ష‌న్ ఓరియెండెట్‌గా క‌నిపిస్తున్నా… కామెడీలో కేక పుట్టించే స‌న్నివేశాలు ఈసినిమా నిండా ఉన్నాయ‌ట‌. బ్ర‌హ్మానందం, ఎమ్మెస్ నారాయ‌ణ‌తో పాటు… ఎన్టీఆర్ కూడా ప్రేక్ష‌కుల‌ను తెగ న‌వ్విస్తార‌ట‌. ఈ విష‌యాన్ని కోన వెంక‌ట్         ప్ర‌స్తావిస్తూ..“ఎన్టీఆర్‌లోని కామెడీ యాంగిల్ గురించి నాకు బాగా తెలుసు. `అదుర్స్` కోసం ప‌నిచేస్తున్న‌ప్సుడు ఆయ‌న‌.. కామెడీ ఏ స్థాయిలో పండించ‌డ‌ల‌రో అర్థ‌మైంది. అందుకు త‌గిన స‌న్నివేశాలు బాద్‌షాలో రాసుకొన్నా. క‌చ్చితంగా ఈ సినిమాలో వినోదం.. దూకుడుస్థాయికి మించి ఉంటుంది“ అంటున్నారు. అన్న‌ట్టు ఈ సినిమాలో ఎమ్మెస్ నారాయ‌ణ ఓ టాప్ ద‌ర్శ‌కుడిగా క‌నిపిస్తార‌ట‌. ఎమ్మెస్‌ని అడ్డుపెట్టుకొని శ్రీ‌ను వైట్ల కొంత‌మంది ద‌ర్శ‌కుల‌పై సెటైర్లు వేశాడ‌ట‌. మ‌రి శ్రీ‌ను టార్గెట్ చేసింది ఎవ‌రినో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాలి.

Exit mobile version