అల్లు అర్జున్ డాన్స్‌కి మరో కథానాయిక ఫ్యాన్ అయిపోయింది. ఏం డాన్సండీ బాబూ… అంటూ కితాబిచ్చేస్తోంది. ఆ కథానాయిక ఎవరో కాదు… కేథరిన్. ఇద్దరమ్మాయిలతో సినిమా కోసం బన్నీతో జత కట్టింది. ఆ అనుభవాలను కేథరిన్ ఇలా చెప్పుకొచ్చింది.. బన్నీ మంచి డాన్సర్ అని విన్నా. అతని సినిమాలు కూడా చూశా. కానీ సెట్లో చూస్తే.. అమ్మెయ్ అనిపించింది. అతనిలా కష్టపడే మరో వ్యక్తిని నేను చూళ్లేదు. బన్నీ ఎటిట్యూడ్ నాకు భలే నచ్చింది.. అని కితాబు ఇచ్చేస్తోంది. ఇలాంటి సినిమాల్లో నటించడం నా అదృష్టం. కథానాయికలు గ్లామర్ పాత్రలే ముఖ్యం. అవే గుర్తింపు తీసుకొస్తాయి. అలాంటి పాత్రల కోసమే ఎదురుచూస్తున్నా అని నిజాయతీగా చెబుతోంది.