జబర్ దస్త్ లో… ’ఏవీయస్’

avsజబర్ దస్ట్’ ఖతర్నాక్ కామెడీ షో.. లో ఏవీయస్.. ఏంటీ షాక్ అయ్యారా..? జబర్ దస్ట్ లో ఏవీయస్ ఏంటీ.. ఆయనెప్పుడూ.. ఎంట్రీ ఇచ్చారు అనుకుంటున్నారా.. ! మీ సందేహం నిజమేనండీ.. ఆయన ఎంట్రీ ఇవ్వలేదూ… కానీ ఆయన మేనరిజం “మీరు బాగున్నారు.. మీరు చాలా బాగుంటారూ.. ఇంతముందుకూ ఇంకా బాగుండేవారూ… ” వచ్చేసింది. ఈటీవి లో ప్రతి గురువారం రాత్రి ప్రసారమయ్యే ఈ జబర్ దస్ట్ కామెడీ షో లో ధనాధన్ ధన్ రాజ్ ఈ స్కిట్ ను ప్రదర్శించారు. ఈ స్కిట్ కూడా చాలా హైలైట్ అయింది. అనంతరం ఈ స్కిట్ గురించి ధన్ రాజ్ చెబుతూ.. ఈ స్కిట్ ఏవియస్ గారిదని.. ఈ స్కిట్ లైన్ ను వాడుకుంటానని ఏవీయస్ గారిని అడిగినప్పుడు.. మనస్పూర్తిగా చెబుతున్నా వాడుకొమ్మని ఏవియస్ గారు చెప్పారని ధన్ రాజ్ చెప్పుకొచ్చారు. అందుకు ఆయన ఏవియస్ కు కృతజ్ఞతలు కూడా చెప్పారనుకోండీ. అయితే, ఈ ఎప్పుడో స్తేజ్ పైన ఏవీయస్ ప్రదర్శించిన ఈ స్కిట్ ఇప్పుడు జబర్ దస్త్ ప్రోగ్రామ్ లో అందరిని జబర్ దస్త్ గా నవ్వించడం విశేషం. ఈ కామెడీ లైన్ లో సీరియస్ ఎక్స్ ప్రెషన్స్ తో కామెడీ పంచ్ లు విసరడం అందరినీ ఆకర్షించింది. స్కిప్ట్ లదేముందండీ.. ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి.. ఇలాంటి స్క్రిప్టు లు దొరకవు ఏవీయస్ గారూ.. అనేలా ఉంది ఈ స్క్రిప్టు అంటున్నారు.. జబర్ దస్ట్ వ్యూవర్స్…!