అంతర్జాతీయ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’. 2009లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించగా.. మళ్ళీ దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ ని తెరపైకి తీసుకొచ్చారు. భారీ అంచనాల మధ్య గత ఏడాది డిసెంబర్ 6న విడుదలైన 3డీ విజువల్ వండర్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. అయితే ఈ మూవీ విడుదలై ఇప్పటికే ఆర్నెళ్లు గడవగా.. తాజాగా ఇండియాలో స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్.
కాగా ఈ సినిమా ఇప్పటి వరకు ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్లలో రెంట్ విధానంపై సందడి చేసింది. అయితే ఇక ఎలాంటి చెల్లింపులు లేకుండా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ‘అవతార్ 2’.. జూన్ 7 నుంచి ఆరు భాషల్లో (ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ) భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో సినీ ప్రియులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.