నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆటోనగర్ సూర్య. సమంత కథానాయిక. దేవాకట్టా దర్శకుడు. డిసెంబరు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అనూప్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటల్ని ఈనెల 30న విడుదల చేస్తారట. ఈనెల 23న ఫస్ట్‌లుక్ చూపిస్తారు..! నాగచైతన్య పాత్ర ఈ సినిమాలో మాస్‌ని అలరిస్తుందని చిత్రబృందం చెబుతోంది. సుదీర్ఘంగా చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమా చైతూకి ఎలాంటి ఇమేజ్ ని తీసుకొస్తుందో మరి. ప్రస్థానం తరవాత దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నచిత్రమిది. మరి మాస్, కమర్షియల్ అంశాలను ఆయన ఎలా డీల్ చేశాడనేది ఆసక్తికరం.