యాభై రోజులు… వంద కోట్లు ???

ad 50daysపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అత్తారింటికి దారేది’. సమంత, ప్రణీత లు హీరోయిన్స్. నధియా, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం విజవంతంగా ప్రదర్శించబడి మరో రెండు రోజుల్లో యాభై రోజుల పండగ జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా యాభై రోజుల పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక భారీ కలెక్షన్స్ రాబట్టుకుట్టున్న ఈ చిత్రం 100కోట్ల క్లబ్ వైపుకు దూసుకుపోతుంది. యాభై రోజుల పండగ నాటికి ఈ వంద కోట్ల మార్కు చేరుతుందని టీం అంచనా వేస్తోంది. మరి యాబై రోజుల పండగ నాటకీ ఈ మార్క్ చేరుతుందా? లేదా? చూడాలి. ఆల్ ది బెస్ట్ అత్తారింటికి టీం.