Site icon TeluguMirchi.com

రెండు రోజులకు 18 కోట్లు

pavanవావ్‌… అత్తారింటికి దారేది అద‌ర‌గొడుతోంది. బాక్సాఫీసు ద‌గ్గర స‌రికొత్త రికార్డులు సాధించే దిశ‌గా ముందుకు వెళ్తోంది. ప‌వ‌న్ ప్రభంజ‌నం ఎలా ఉంటుందో, అత‌ని సినిమా హిట్‌.. అయితే వ‌సూళ్ల సునామీ ఏ రేంజులో ఉంటుందో అత్తారింటికి దారేది మ‌రోసారి నిరూపిస్తోంది. తొలి రోజు రూ.9 కోట్లు సాధించిన ఈ చిత్రం, రెండో రోజు కూడా స‌రిగ్గా 9 కోట్లు రాబ‌ట్టుకొని.. త‌న హ‌ల్ చ‌ల్ త‌గ్గలేద‌ని నిరూపించింది. అత్తారింటికి దారేది తొలి ఆట ప‌డ‌గానే హిట్ టాక్ వ‌చ్చేసింది. ఇప్పుడు అదే ఊపును కొన‌సాగిస్తోంది. నైజాంలో ఇప్పటి వ‌ర‌కూ ఈ సినిమా రూ.5 కోట్లు సాధించింది. ఇదో ఆల్‌టైమ్ రికార్డ్‌. ఆదివారం కూడా ఇదే ఊపు ఉంటుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌గ‌ధీర‌, గ‌బ్బర్ సింగ్‌ల‌కు ఇక హ‌డ‌లే…!

Exit mobile version