Site icon TeluguMirchi.com

అత్తారింటికి కొత్త ట్రైల‌ర్‌

pavanమ‌రో రెండు రోజులు. అంతే.. అత్తారింటికి దారేది సినిమా వ‌చ్చేస్తుంది. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాని అనుకొన్న స‌మ‌యానికంటే ముందే విడుద‌ల చేయాల్సివ‌స్తోంది. దాంతో ప్రచారానికి స‌మ‌యం దొర‌క‌లేదు. ఉన్న ఈ రెండు రోజుల‌నూ వాడుకోవాల‌ని చిత్రబృందం భావిస్తోంది. అందుకే కొత్త ట్రైల‌ర్‌ ని విడుద‌ల చేసింది. ”సింహం ప‌డుకొంది క‌దా అని జూలుతో జ‌డవేయ‌కూడ‌దురా, అలాగే పులి ప‌ల‌కరించింది క‌దా అని ప‌క్కన నిల‌బ‌డి ఫోటో తీయించుకోకూడ‌దురోయ్‌..” అనే డైలాగ్ అద‌ర‌గొడుతోంది. అంతకు ముందు విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌లో కూడా సింహంపై ఓ డైలాగ్ వినిపించారు. ఇది ఇంకోటి.. ఇంకా సినిమాలో ఇంకెన్ని ఉన్నాయో.. ఈ సింహం డైలాగులు.

Exit mobile version