ప‌వ‌న్ క‌బ‌డ్డీ ఆడేస్తాడ‌ట‌

pavanటీజ‌ర్‌లో ఒక్క డైలాగూ లేదు గానీ.. బ‌య‌ట మాత్రం అత్తారింటికి దారేది డైలాగులు ఒకొక్కటీ లీక్ అవుతున్నాయి. త్రివిక్రమ్ శైలిలోనే అద‌ర‌గొట్టేస్తున్నాయి. సాధార‌ణంగా కామెడీ పంచ్‌లే విసిరే త్రివిక్రమ్‌… ఈసారి బుల్లెట్‌లాంటి యాక్షన్ పంచ్‌లూ వ‌దులుతున్నాడు. అలాంటి డైలాగ్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయ‌ట‌. ”గ్రౌండ్‌లో దిగాక బ్యాక్ గ్రౌండ్ల‌కు భ‌య‌ప‌డే అల‌వాటు లేదు.. ఏ బాడీ అయినా క‌బ్బడ్డీనే..”, ”ఇంత వైలెంట్ సెట్యువేష‌న్‌లో కూడా సైలెంట్‌గా ఉండ‌డానికి నేను వివేకానంద‌ను కాదు.. గౌత‌మ్‌.. గౌత‌మ్ నందా..” – ఇలాంటి డైలాగ్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయ‌ట‌. ఆడియో విడుదల రోజు ఈ సినిమా ట్రైల‌ర్ కూడా చూపించ‌నున్నారు. అందులో ఈ డైలాగ్స్ వినిపిస్తాయ‌ట‌.