ఇంట్రవెల్ వ‌ర‌కూ ఫ్రీగా చూసేశారు..

Attarintiki-Daredhi-movie-leakedఅత్తారింటికి దారేది సినిమా ఇంట‌ర్నెట్‌లో ఇప్పుడు హ‌ల్ చల్ చేస్తోంది. ఆదివారం సాయింత్రం ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్యక్తులు ఈ సినిమా ఫ‌స్టాఫ్ ని ఇంటర్నెట్‌లో పెట్టేశారు. దాంతో 95 నిమిషాల సినిమా ఫ్రీగా చూసేశారు. లింకుల‌ను ఒక‌రికి ఒక‌రు పాస్ చేసుకొంటూ…. ఈ సినిమాని పంచుకొంటున్నారు. క్వాలిటీ కూడా బాగానే ఉండ‌డంతో… హాయిగా ఇంట్లోనే కూర్చుని అత్తారింటికి దారేది వీక్షించేశారు. లింకులు బ్లాక్ చేసినా ఆల్రెడీ డౌన్‌లోడ్ అయిపోయిన వీడియోల ద‌గ్గరే అస‌లు స‌మ‌స్య. ఈ సినిమా ఇంకా అంద‌రినీ చేరుకోక ముందే.. విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం భావిస్తోంది. ఈ శుక్రవారం అత్తారింటికి వ‌చ్చేసే అవ‌కాశాలున్నాయి.