Site icon TeluguMirchi.com

ప‌వ‌న్ ఫ‌స్ట్ లుక్ అదిరింది

Attarintiki-Daredi-First lookస్టైల్‌కి మారు పేరు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. సినిమాల్లో ఆయ‌న డ్రెస్సింగ్ సెన్స్‌, కాస్ట్యూమ్స్ చాలా ట్రెండీగా ఉంటాయి. తొలి సినిమా నుంచీ ఆయ‌న‌ది ఇదే ప‌ద్దతి. ఇప్పుడు అత్తారింటికి దారేదిలోనూ ప‌వ‌న్ త‌న డీసెన్సీని కాపాడుకొన్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్టర్ శనివారం విడుద‌లైంది. ప‌వ‌న్ లుక్ అభిమానుల‌కు విప‌రీతంగా న‌చ్చేసింది. ఇక టీజ‌ర్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తున్నారు. టీజ‌ర్‌లో ని డైలాగులు లీకై ముందే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవి ప‌వ‌ర్ ఫుల్‌గా ఉండ‌డంతో – ఈ సినిమాపై అభిమానుల అంచ‌నాలు రెట్టింపయ్యాయి. ఆదివారం ఈ సినిమాలోని పాట‌ల్ని విడుద‌ల చేయాల‌నుకొన్నారు. కానీ ఆడియో రిలీజ్ ఈనెల 19కి వాయిదా ప‌డింది. సినిమాని మాత్రం ఆగ‌స్టు 9నే విడుద‌ల చేయ‌నున్నారు.

Exit mobile version