వీడు ఆరడుగుల బుల్లెట్టూ – దైర్యం వదిలిన రాకెట్టూ –
ఇదీ పవన్ కల్యాణ్ క్యారెక్టర్! అత్తారింటికి దారేది సినిమాలో పవన్ పాత్ర చిత్రణ ఎలా ఉంటుందో ఆ టీజర్‌తోనే అర్థమైపోయింది. పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అత్తారింటికి దారేది ఫస్ట్‌లుక్ ఆదివారం బయటకు వచ్చింది. పవన్ స్టైలింగ్, దేవిశ్రీ ప్రసాద్ సౌండిండ్ – కలసి అదరగొట్టింది. పవన్ 30 సెకన్లలోనే మతి పోగొట్టేశాడు. ఈ సినిమాలో పవన్.. గౌతమ్ నందాగా కనిపించనున్నాడు. ఆ పేరు కూడా టెప్టింగ్గానే ఉంది. సూపర్ హిట్ సినిమాకి కావల్సిన అన్ని లక్షణాలూ ఈ టీజర్లోనే కనిపిస్తున్నాయని పవన్ అభిమానులు సైతం ఖుషీ అయిపోతున్నారు. ఈనెల 19న ఆడియోతో పాటు, థియేటరికల్ ట్రైలర్ కూడా బయటకు రానుంది. అప్పుడు ఇంకెంత ఖుషీ అవుతారో.