వంద కోట్లకు దారి !! 50రోజుల స్పెషల్:
టాలీవుడ్ చరిత్రలో, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి బతికి బట్టకట్టడం ఎంత కష్టమో , పైరసి రాకాసి బారిన పడిన చిత్రం బతకడం అంతే కష్టం. కాని ఈ చిత్రం విషయంలో జరిగింది పైరసి కాదు. సినిమా విడుదలలైన తర్వాత జరిగేది పైరసి. కాని విడుదలకు ముందే ల్యాబ్ లో వుండే చిత్రం బయటకు పొతే జరిగేది కాన్స్పిరసీ(కుట్ర ) అనే చెప్పాలి.
విడుదలకు ముందే ఛాలెంజ్స్ కు ధీటుగా గా నిలబడి, రికార్డుల పరంగా తెలుగు సినిమా స్థాయి పెంచే చిత్రంగా నిలవడానికి ‘అత్తారింటికి దారేది’ రెడీ అయ్యంది. అల్ ది బెస్ట్ టు అత్తారింటికి టీం.