వంద కోట్లకు దారి !!

ad
వంద కోట్లకు దారి !! 50రోజుల స్పెషల్

వంద కోట్లకు దారి !! 50రోజుల స్పెషల్:

టాలీవుడ్ చరిత్రలో, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి బతికి బట్టకట్టడం ఎంత కష్టమో , పైరసి రాకాసి బారిన పడిన చిత్రం బతకడం అంతే కష్టం. కాని ఈ చిత్రం విషయంలో జరిగింది పైరసి కాదు. సినిమా విడుదలలైన తర్వాత జరిగేది పైరసి. కాని విడుదలకు ముందే ల్యాబ్ లో వుండే చిత్రం బయటకు పొతే జరిగేది కాన్స్పిరసీ(కుట్ర ) అనే చెప్పాలి.

pavan1జల్సా వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ చిత్రం వస్తుందన్నప్పటి నుండి ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ ‘అత్తారింటికి దారేది’ అన్నారు. మరిన్ని అంచనాలు పెరిగాయి. అన్నీ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న టైం లో రాష్ట్రం లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఓ రెండు సార్లు చిత్రం విడుదల వాయిదా పడింది. ఇక కాస్త పరిస్థితి సర్దుకుందని అనుకున్నవేళలో రీలిజ్ కు సిద్దం చేశారు. అయితే ఇక్కడే చిత్ర టీంకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. విడుదలకు ముందే ఈ చిత్రం 90నిమిషాల బయటకు వచ్చేసింది. యూనిట్ సభ్యులంతా షాక్. ఎంచేయాలో తెలియని పరిస్థితి. ఇక సినిమా పరిస్థితి అంతే! అనుకున్నారంతా.

pavan trivikramకాని పవన్, త్రివిక్రమ్ లకు ఓ కాన్పిడేన్స్ వుంది. అదే.. సినిమా ను నిలబెట్టిది ‘మనం కాదు జనం’ అని. సరిగ్గా ఇదే జరిగింది. ప్రేక్షకులు పవన్, త్రివిక్రమ్ వెనుక నిల్చున్నారు. త్రివిక్రమ్ ,పవన్ వినోదాన్ని వెండి తెరపై ఎంజాయ్ చేయాలనుకున్నారు. పైరసి ని పట్టించుకోలేదు. అత్తారింటి వినోదాన్ని ధియేటర్లో చూసే మజానే వేరు అని అనుకున్నారంతా. అదే జరిగింది.

pavan2సెప్టెంబర్ 27 చిత్రం ధియేటర్లో కి వచ్చింది. సినిమా చూసిన వారంతా వావ్: అన్నారు. అప్పటివరకు ‘గబ్బర్ సింగ్’ గా గన్స్ తో ఆడుకొనే పవన్ ను త్రివిక్రమ్ ‘అత్తారింట్లో’ పడేశాడు. ఈ చిత్రంతో పవన్ లో కనిపించిన కొత్త షేడ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. పవన్ నటన, త్రివిక్రమ్  ప్రతిభ, దేవిశ్రీ మ్యూజిక్ మ్యాజిక్ చిత్రాన్ని పీక్స్ కు తీసుసుకెళ్ళయి. పైరసి ఈ చిత్రం పై ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. అత్తారింటికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. దీంతో అత్తారింటికి దారేది 100కోట్ల దారి పట్టింది.

ad-50daysఅవును.. ‘అత్తారింటికి దారేది’ ఇప్పుడు 50రోజులుపూర్తి చేసుకొని టాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ చేరబోతున్న మొదటి చిత్రంగా సాగుతోంది. మరో  కొద్ది రోజుల్లో ఈ మార్కు ను చేరుకోనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
విడుదలకు ముందే  ఛాలెంజ్స్ కు ధీటుగా గా నిలబడి, రికార్డుల పరంగా తెలుగు సినిమా స్థాయి పెంచే చిత్రంగా నిలవడానికి ‘అత్తారింటికి దారేది’ రెడీ అయ్యంది. అల్ ది బెస్ట్ టు అత్తారింటికి టీం.