Ashwin Babu : అశ్విన్ బాబు హీరోగా ‘వచ్చినవాడు గౌతమ్’ ఫస్ట్ లుక్ విడుదల !


Ashwin Babu :యంగ్ టాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్’ నుండి పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. డిఫరెంట్ సబ్జెక్ట్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్న అశ్విన్ బాబు ఈసారి మెడికల్ యాక్షన్ మిస్టరీ జానర్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి మామిడాల ఎం.ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టీ.గణపతి రెడ్డి లావిష్‌గా నిర్మిస్తుండగా కో-ప్రొడ్యూసర్లుగా గోల్డ్ లైన్ క్రియేషన్స్ మరియు ప్రవల్లిక యోగి వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్‌లో బ్లడ్ మరియు స్టెత్‌తో ఉన్న అశ్విన్ బాబు లుక్ సినిమాపై భారీ క్యూరియాసిటీని పెంచింది. పోస్టర్ ని గమనిస్తే ఆయన పాత్రలో మిస్టరీ, యాక్షన్, థ్రిల్ మిక్స్ అవుతాయని అర్థమవుతోంది. ఈ చిత్రంలో యంగ్ హీరో సాయి రోణక్ ఓ కీలకమైన కెమియో పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రంలో అశ్విన్ బాబు తో పాటు, రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్, ఖేడేకర్, అభినయ, అజయ్, VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ, అమర దీప్, అభిత్ భూషణ్, నాగి కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌర హరి మ్యూజిక్ అందిస్తుండగా, ఎం. ఎన్ బాల్ రెడ్డి డీవోపీ, M R వర్మా ఎడిటర్. సురేష్ భీమగని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రం 90% షూటింగ్ పూర్తి చేసుకుంది. తొందరలో మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, పూర్తి చేసుకుని, త్వరలో మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు.