Site icon TeluguMirchi.com

ఈవారం జూనియర్‌ సమంత ఔట్‌?

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 నాలుగు వారాలు పూర్తి చేసుకుని నలుగురు ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం అయిదవ వారం జరుగుతుంది. ఈ అయిదవ వారంలో ఎలిమినేషన్స్‌లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారు ఎవరంటే రాహుల్‌, పునర్నవి, బాబా భాస్కర్‌, మహేష్‌ విట్టా, హిమజ, అషు, శివజ్యోతి. ఈ ఏడుగురిలో రాహుల్‌ మరియు అషు రెడ్డిలు వీక్‌ కంటెస్టెంట్స్‌గా అనిపిస్తున్నారు.

రాహుల్‌ టాస్క్‌ల విషయంలో సీరియస్‌గా ఉండటం లేదు అంటూ ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరికి రాహుల్‌ పట్ల సాఫ్ట్‌ కార్నర్‌ ఉంది. పులిహోర రాజా అనే ట్యాగ్‌ అతడికి ఉపయోగపడుతుందనే అంచనాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే అషు కు కాస్త మైనస్‌ అవుతుంది. ఆమె టాస్క్‌ల్లో ఎక్కువగా సీరియస్‌గా కనిపించక పోవడంతో పాటు, ఆమెకు స్క్రీన్‌ స్పేస్‌ ఎక్కువగా ఉండటం లేదు. అందుకే ఆమెకు ఓట్లు వేసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపడం లేదు అంటున్నారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం కనుక నిజం అయితే జూనియర్‌ సమంత అంటూ ఎంట్రీ ఇచ్చిన అషు ఈ వారం బయటకు రావడం ఖాయం అనిపిస్తుంది.

Exit mobile version