Site icon TeluguMirchi.com

Love Me Teaser : ‘లవ్ మీ’ టీజర్.. వామ్మో దెయ్యంతో రొమాన్సా ?


యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లవ్ మీ’. ‘ఇఫ్ యూ డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాన్నిశిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత మరియు నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మించారు. ఇటీవలే రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్‌ ఆకట్టుకోగా, తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

Prasanna Vadanam Teaser : వింత వ్యాధితో బాధపడుతున్న సుహాస్..

భయం వేసే చోట రొమాన్స్ ఇంకా ఎక్సయిటింగ్ గా ఉంటుంది అంటూ హీరో వాయిస్ తో టీజర్ ప్రారంభమవుతుంది. అలా అని వెళ్లి దెయ్యంతో రొమాన్స్ చేయలేం కదా అని హీరోయిన్ అంటే.. ఒకసారి డేట్ కు పిలిస్తే కదా తెలిసేది అంటాడు హీరో. మరి దెయ్యంతో రొమాన్స్ చేయాలనే అతని కోరిక నెరవేరుతుందా ? అతనికి దెయ్యం కనిపించినప్పుడు ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగిస్తుంది టీజర్. మొత్తం మీద టీజర్ ఆద్యంతం రొమాన్స్ మరియు హారర్ అంశాలతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Love Me Teaser - Ashish | Vaishnavi | Arun Bhimavarapu | M M Keeravaani |PC Sreeram | Dil Raju

Exit mobile version