అన్న చెల్లెల్లు ఒక్కటైనా వేళా …

ఈరోజు అర్జున్ కపూర్ పుట్టినరోజు సందర్బంగా జాన్వీ కపూర్ తన ఇంస్టాగ్రామ్ లో అర్జున్ కపూర్ తో పాటు తన అక్క ,చెల్లిలతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది.ఫోటో తో పాటు ” మా బలానికి కారణం నువ్వు .లవ్ యు ,హ్యాపీ బర్త్ డే అర్జున్ భయ్యా ❤️ ” అని భావోద్వేగ మైన సందేశాన్ని రాసి పోస్ట్ చేసింది.

శ్రీదేవి చనిపోయినప్పుడు అర్జున్ కపూర్ తన చెల్లిలకు అండగా ఉంటానని మీడియా ముందు చెప్పాడు.తాను దగ్గర ఉండి వాళ్ళని ఓదార్చాడు. ఇప్పుడు జాన్వీ కపూర్ నటించిన ధఢక్ మూవీ రిలీజ్ కి సిద్ధంగా. ఈ మూవీ కోసం బాలీవుడ్ పరిశ్రమ మొత్తం ఎదురు చూస్తుంది .

ఈ మూవీ ని కరణ్ జోహార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ మూవీ లో జాన్వీ కి జోడిగా ఇషాన్ ఖత్తర్ నటిస్తున్నాడు . ఈ మూవీ మరాఠీ మూవీ సైరత్ కి రీమేక్ .