Seetha Payanam : మల్టీ ట్యాలెంటెడ్ నటుడు అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘సీతా పయనం’ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ విడుదలైంది. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధ్రువ సర్జా పవర్ ఫుల్ పాత్రలో పవన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ రోజు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో ధ్రువ సర్జా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తన మామ అయిన అర్జున్ సర్జా దర్శకత్వంలో నటిస్తున్న ఈ చిత్రం లో ఆయన పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాలో అర్జున్ సర్జా, ఐశ్వర్య అర్జున్, నిరంజన్, సత్యరాజ్, ప్రకాశ్ రాజ్, కోవై సరళ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, అర్జున్ కూడా కథలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.
Also Read : తమన్నా భాటియా ‘ఓదెల 2’ ట్రైలర్ లాంచ్ డేట్..
పోస్టర్‌లో ధ్రువ సర్జా పొడవాటి వెంట్రుకలతో, గడ్డంతో మాస్ అప్పీల్‌తో కనిపించారు. ఆయన పాత్ర పేరు పవన్, ఇది లార్డ్ హనుమాన్కి సంబంధించిన మరో పేరు కావడం విశేషం. మెడలో ఒకే ఒక రుద్రాక్ష మాల ధరించి ఉన్న ఆయన లుక్ ద్వారా పాత్రకి ఉన్న ఆధ్యాత్మికత, శక్తిని సూచిస్తున్నారు. అర్జున్ సర్జా స్వయంగా లార్డ్ హనుమాన్ భక్తుడు, ఆయన చెన్నైలో హనుమాన్ మందిరాన్ని నిర్మించారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం అర్జున్ సర్జా తన విస్తృతమైన ఫిల్మ్ మేకింగ్ అనుభవాన్ని వినియోగించి, కమర్షియల్ అంశాలతో నిండిన ఒక శక్తివంతమైన కథను రూపొందించారు. ‘సీతా పయనం’ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్‌కు మంచి స్పందన లభించగా, ఇప్పుడు ధ్రువ సర్జా ఫస్ట్ లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.