Arjun S/O Vyjayanthi Censor : అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి హైప్ పీక్స్‌.. సెన్సార్ నుంచి పాజిటివ్ బజ్!


Arjun S/O Vyjayanthi : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి కీలక పాత్రలో రూపొందిన “అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి” చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్‌ను పొందింది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 24 నిమిషాలు కాగా, ఇది ఒక యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకోనుందని సెన్సార్ నుండి టాక్ బలంగా వినిపిస్తుంది. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రాన్ని అత్యంత ఆసక్తికరమైన కథనంతో రూపొందించగా, అశోక వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించారు. తల్లి-కొడుకు మధ్య భావోద్వేగ బంధం, త్యాగం, న్యాయం కోసం పోరాటం వంటి అంశాలు ఈ సినిమాకు అసలైన పట్టు. విజయశాంతి ఓ పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా, కళ్యాణ్ రామ్ న్యాయాన్ని తనదైన శైలిలో సాధించే పాత్రలో మెప్పించనున్నారు. ఈ రెండు పాత్రల మధ్యనున్న సంఘర్షణ, అనుబంధం ప్రేక్షకుల మనసులను తాకేలా ఉంటుందని సమాచారం.

Also Read :  HIT 3 : నాని హిట్3 కలెక్షన్ల తుపాను.. రెండు రోజుల్లో ₹62 కోట్లు!

సినిమాలో థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అనూహ్యమైన ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేయనున్నట్లు చెప్తున్నారు. స్క్రీన్‌ప్లే రాసిన శ్రీకాంత్ విస్సా కథనాన్ని చక్కగా మలచిన విధానం, అజనీష్ లోకనాథ్ అందించిన నేపథ్య సంగీతం ఎమోషన్స్‌ను బలంగా ఎలివేట్ చేస్తాయని టాక్. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, సోహైల్ ఖాన్ వంటి తారాగణం సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ సినిమాను విజువల్ లెవెల్‌లో మరో స్థాయికి తీసుకెళ్తాయి అని టాక్. ఈ చిత్రం ఏప్రిల్ 18, 2025న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుండగా, అభిమానులు బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెన్సార్ సభ్యులు సినిమా యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా, ముఖ్యంగా కళ్యాణ్ రామ్, విజయశాంతి లు తమ నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారని ప్రశంసించినట్టు తెలుస్తోంది.

Also Read :  Killer Glimpse : 'కిల్లర్' గ్లింప్స్ రిలీజ్.. అదరగొట్టిన జగతి మేడమ్