Site icon TeluguMirchi.com

NBK108 లో బాలీవుడ్ నటుడు !


గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల మోస్ట్ అవైటెడ్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ NBK108 లో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్ర ల్లో నటించనున్నారు. డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇకపోతే కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. అయితే ఇప్పుడు ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తెరపైకి వచ్చారు. అనౌన్స్‌మెంట్ వీడియోలో అర్జున్ రాంపాల్, బాలకృష్ణ లెజెండ్ చిత్రంలోని ”ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు” అనే పాపులర్ డైలాగ్ చెప్పారు. ఇందులో అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి మధ్య సంభాషణ కూడా వుంది. అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. బాలకృష్ణ, అర్జున్ రాంపాల్ లని కలిసి తెరపై చూడటం ఆసక్తికరంగా ఉండబోతుంది.

Welcome On Board Arjun Rampal | #NBK108 | Nandamuri Balakrishna | Anil Ravipudi | Kajal | Sreeleela

Exit mobile version