ఆ బ్రేక్అఫ్ తో నాకేంటి సంబంధం !

roshanబాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, భార్య సుసానే లు విడిపోతున్నట్లు పబ్లిక్ స్టేట్ మెంట్ ఇచ్చి అందరికీ షాక్ గురిచేశారు. వీరిమధ్య విభేదాలకు కారణం ఏంటో ? అని బాలీవుడ్ జనాలు తలలు పట్టుకున్నారు.  ఇంతకాలం ఇద్దరు పిల్లలతో సజావుగా సాగిన వీరి కాపురం ఇలా ముగియడం గల కారణాలపై అనేక వార్తలు గుప్పుమన్నాయి. ఈ వ్యవహారంలో నటుడు అర్జున్ రాంపాల్ పేరు గట్టిగా వినిపించింది.

హృతిక్ , సుసానే లువిడిపోవడానికి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అర్జున్ రాంపాలే కారణమంటూ బాలీవుడ్ మీడియాలో  కొన్ని కధనాలు వచ్చాయి. ఈ వరుస కధనలపై అర్జున్ స్పందించాడు.  ‘ఈ విషయంలో నాకెలాంటి సంబంధంలేదు. నాకు దగ్గరి స్నేహితులైన వారు విడిపోవాలని నిర్ణయించుకోవడం చాలా బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితులు వారికి చాలా కష్టమైనవి. అయితే, ఇదే సమయంలో వారిద్దరి మధ్య నా జోక్యం ఉందంటూ వచ్చిన గాసిప్స్ ను నేను కూడా విన్నాను, చదివాను. ఆ విషయం నన్ను తీవ్రంగా బాధపెట్టింది. ఇలాంటప్పుడు వారిద్దరూ ప్రేమ, ప్రశాంతతతో ఉండాలని నేను, నా భార్య కోరుకుంటున్నాము. మా వైపు నుంచి వారికెప్పుడూ మద్దతు ఉంటుంది’ ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. కారణాలు ఏవైనా  హృతిక్, సుశానే విడిపోవడాన్ని  అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.