ఏఆర్ రెహ్మాన్.. రియాక్షన్ ఇది


లాక్ డౌన్ సత్ఫాలితాలను ఇస్తుందనుకున్న వేళ ఒక్కసారిగా ఢిల్లీలోని మర్కజ్ మసీదులో కరోనా కలకలం రేపింది. అక్కడ మార్చ్ నెలలో జరిగిన జమాత్‌కు వెళ్లి వచ్చిన వారికి భారీ సంఖ్యలో ఈ వైరస్ అంటుకుందని తేలింది. ఆ ప్రార్థనల్లో మొత్తం 9000 మంది పాల్గొనగా వారిలో 6000 మందిని అధికారులు గుర్తించారు. వీరిలో 400కుపై కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 3000 మందిని గుర్తించే పనిలో ఉన్నారు.

. అయితే ఢిల్లీలో జ‌రిగిన కార్యక్రమంపై స‌ర్వత్రా విమ‌ర్శలు వ‌స్తున్న నేప‌థ్యంలోఏఆర్ రెహ‌మాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. క‌రోనాని అరిక‌ట్టేందుకు రేయింబ‌వ‌ళ్ళు క‌ష్ట‌ప‌డుతూ త‌మ ప్రాణాల‌ని ప‌ణంగా పెడుతున్న వైద్యులు, నర్సులు, ఇత‌ర సిబ్బందికి ధ‌న్యావాదాలు తెలిపారు రెహ‌మాన్. మ‌త‌ప‌ర‌మైన ప‌విత్ర స్థలాల‌లో గుమిగూడే స‌మ‌యం ఇది కాదు. దేవుడు మ‌న హృద‌యంలోనే ఉన్నాడు. ప్ర‌భుత్వం చెప్పిన సూచ‌న‌లు త‌ప్ప‌క పాటించండి. స్వీయ నియంత్ర‌ణ పాటిస్తే ఎక్కువ రోజులు బ‌త‌క‌వ‌చ్చు. వైర‌స్‌ని వ్యాప్తి చేస్తూ, సాటి మ‌నుషుల‌కి హాని క‌లిగించ‌కండి. మీరు వైర‌స్ సోక‌దు అనుకుంటే అది మూర్ఖత్వమే” అని అన్నారు.