Site icon TeluguMirchi.com

ఏప్రిల్ 28 న బంద్..

Baahubali2-theaters

దేశ వ్యాప్తంగా బాహుబలి సునామి నడుస్తుంది..ఎక్కడ చూసిన ఎక్కడ విన్న ఒకే ఒక మాట అదే బాహుబలి 2 ఎలా ఉండబోతుంది…? ఫస్ట్ డే టికెట్స్ దొరికాయా..? కట్టప్ప నిజంగానే బాహుబలి ని చంపాడా..? అని అంత మాట్లాడుకుంటున్నారు. ఇక ఏప్రిల్ 28 న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం అందరూ సెలవు కావాలని అంటున్నారు..గతం లో ‘కబాలి’ సినిమా కోసం తమిళనాడులో కొన్ని సాఫ్ట్‌వేర్‌ సంస్థలు తమ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినాన్ని ప్రకటించిన విషయం విదితమే.

ఇక, ఇప్పుడు ‘బాహుబలి’ వంతు. కార్పొరేట్‌ సంస్థల దాకా వెళ్లలేదుగానీ, సినీ పరిశ్రమలో మాత్రం ‘బాహుబలి సెలవు’ అంశం చర్చనీయాంశమవుతోంది. మంచు మనోజ్‌ హీరోగా ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ సినిమా షూటింగ్‌కి ఒక రోజు విరామం ప్రకటించారట. అదీ ‘బాహుబలి ది కంక్లూజన్‌’ విడుదల రోజున. సినిమా చూసేందుకు వీలుగా దర్శకుడు తమకు సెలవు ఇచ్చాడంటూ మంచు మనోజ్‌ ట్విట్టర్‌లో వెల్లడించాడు. ఈ మూవీ మాత్రమే కాదు మిగిలిన సినిమా షూటింగ్ లు కూడా నిలిపి వేసినట్లు తెలుస్తుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

Exit mobile version