Site icon TeluguMirchi.com

నాకు అలా ఏం అనిపించలేదు… మంచి ప్రయత్నమే అనుకున్నా

ముద్దుగుమ్మ అనుష్క ‘బాహుబలి 2’ చిత్రంలో దేవసేనగా నటించి ఎలా మెప్పించిందో అందరికి తెలుసు. ఈ అమ్మడు ‘బాహుబలి 2’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఈ సమయంలో అనుష్క ‘సైజ్‌ జీరో’ గురించి లావు పెరిగిన విషయం హాట్‌ టాఫిక్‌గా మారింది. పాపం పాత్ర కోసం అంత కష్టపడినా కూడా ‘సైజ్‌ జీరో’ ఫలితం ఇవ్వకపోవడం మీకు బాదగా అనిపించిందా అనే ప్రశ్న అనుష్కకు ఎదురయింది. అనుష్క నవ్వుతూ తన పాత్ర సహజంగా కనిపించడం కోసమే అలా లావుగా మారానని, అలాని హిట్‌ ఇవ్వనంత మాత్రానా ఫీల్‌ అవలేదని అనుష్క చెప్పుకొచ్చింది.

చేసిన ప్రతి ఒక్క చిత్రం సక్సెస్‌ అవాలని ఏమి లేదు, ఒక్కోసారి పరాజయం నుండే చాలా నేర్చుకోవచ్చు అంటూ ఈ అమ్మడు సుద్దులు చెబుతోంది. అంతేకాకుండా అలా సహజత్వం కోసం లావు పెరగడం ఒక మంచి ప్రయత్నం అని భావిస్తాను కానీ వృధా అయింది అని భాదపడను, అలాంటి ఆలోచనే రాలేదు అంటూ అనుష్క చెప్పుకొచ్చింది. ఎంతటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే స్వీటికి పని పట్ల ఉన్న శ్రద్ద గురించి ఆమెతో పని చేసిన ప్రతి ఒక్కరు కూడా చెబుతూనే ఉంటారు. ‘బాహుబలి 2’ చిత్రం తర్వాత అనుష్కతో నటించడానికి బాలీవుడ్‌ స్టార్లంతా కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి అనుష్క అటువైపుగా వెళుతుందా..?? తర్వాత చిత్రం తెలుగులోనేనా…? అనేది ఆసక్తిగా మారింది.

Exit mobile version