Site icon TeluguMirchi.com

ప్రభాస్‌ సెక్సీగా ఉంటాడు అని అనుష్క హాట్‌ కామెంట్స్‌

ముద్దుగుమ్మ అనుష్క, యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ల కాంభోలో చాలా చిత్రాల తెరపైకి వచ్చాయి. ఈ ఇద్దరి కాంభోలో వచ్చిన అన్ని చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. తెర మీద ఈ ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్‌ అవుతుంది. అనుష్క, ప్రభాస్‌లు ఎక్కువ చిత్రాల్లో కలిసి నటించడంలో ఇద్దరి మద్య మంచి స్నేహం నెలకొంది. ఈ ఇద్దరిపై వస్తున్న పుకార్లు కూడా ఎక్కువే. తాజాగా అనుష్క ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ ఇంటర్య్వూలో అనుష్క ప్రభాస్‌పై హాట్‌ కామెంట్‌ చేసింది.

రానా, ప్రభాస్‌లలో ఎవరు సెక్సీగా ఉంటారు అని అడగ్గా రానాను తాను బ్రదర్‌ అంటానని, ఇద్దరిలో ప్రభాస్‌ చాలా సెక్సీగా ఉంటాడు అని చెప్పుకొచ్చింది. ప్రభాస్‌, అనుష్కలు ప్రేమలో ఉన్నారు అనే పుకార్లు జోరుగా ప్రచారం అవుతున్న ఈ సమయంలో స్వీటి ప్రభాస్‌ను సెక్సీగా ఉంటాడు అనడంతో విషయం మరింత హాట్‌ టాఫిక్‌గా మారింది. మొత్తానికి అనుష్క, ప్రభాస్‌ల ప్రేమ గురించి సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రచారం జరగుతుంది. ఈ విషయంపై ఇద్దరిలో ఎవరైనా స్పందిస్తారా చూడాలి.

Exit mobile version