సావిత్రితో వీరికేం సంబంధం..??

savitriదర్శకుడు నాగ అశ్విన్‌ గతకొంత కాలంగా అనేక పరిశోధనలు చేసి, ఎన్నో మెరుగులు దిదుద్దతూ ‘మహానటి’ చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నాడు. ఈ ఏడాది సెట్స్‌పైకి తీనుకెళ్లడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగు తెరకు అచ్చతెలుగు అందాలు పరిచయం చేసిన సావిత్రి కథను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకే ఆలస్యం అయినా పర్లేదు, చక్కగా ‘మహానటి’ని చూపించాలని తెగ తాపత్రయ పడుతున్నాడు. ఈ చిత్రంలో సావిత్రిలా కనిపించడానికి బొద్దుగా, పద్దతిగా ఉండే కీర్తి సురేష్‌ను ఎంపిక చేశాడు. అంతేకాకుండా మరో ముఖ్య పాత్రలో అందాలతార సమంతను కూడా తీసుకున్నారు.

sweety prakashటాలీవుడ్‌ అగ్రకథానాయిక సమంత, యూత్‌ క్రేజీ భామ కీర్తి సురేష్‌లు ఒకే తెరపై కనిపించబోతున్నారంటేనే చాలా ఆసక్తిగా ఉంది. అలాంటిది చిత్రంలో మరో అగ్రకథానాయిక అనుష్క కూడా నటించనుంది. చిత్ర యూనిట్‌ తాజాగా అనుష్కను సంప్రదించినట్టు సమాచారం అందుతోంది. ‘మహానటి’ చిత్రంలో వచ్చిన అవకాశాన్ని దేవసేన అనుష్క ఎందుకు వదులుకుంటుంది అందుకే వెంటనే ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. వైవిధ్యభరిత పాత్రలకు పెద్దపీఠ వేసే అనుష్క ఈ చిత్రంలో ఏ పాత్రలో నటిస్తోంది. సావిత్రితో అనుష్క పాత్రకు గల సంబంధం ఏంటి అనేది చాలా ఆసక్తిగా మారింది. అనుష్కతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నాడట. ఈయన పాత్ర ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. కానీ కీలకమై పాత్రల కోసమే అనుష్కను, ప్రకాష్‌ రాజ్‌ను ఎంపిక చేశారు. ‘మహానటి’ సావిత్రి కథలో ఈ ఇద్దరి పాత్ర ఏంటి, ఈ ఇద్దరికి కథతో ఎలాంటి సంబంధం ఉంది అనేది చర్చనీయాంశంగా మారింది.