Site icon TeluguMirchi.com

అనుష్క ను ఓకే చేసిన రాజమౌళి

Prabhas-Anushka-in-Rajamouli-filmగతంలో ‘బిల్లా’, తాజాగా ‘మిర్చి’ చిత్రాలలో ప్రభాస్‌ తో రొమాన్స్ చేసిన అనుష్క ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా రాజమౌళి రూపొందించే భారీ జానపద చిత్రంలో కథానాయిక పాత్రకు ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో అనుష్క రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ‘విక్రమార్కుడు’లో నటించింది. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి సుమారు వంద కోట్ల బడ్జెట్టుతో నిర్మించే ఈ భారీ చిత్రం ఇప్పుడు ‘టాకాఫ్ ది ఇండస్ట్రీ’గా వుంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించే ఈ చిత్రం కోసం భారీ సెట్స్ రూపకల్పన జరుగుతోంది. ఇందులో రానా దగ్గుబాటి విలన్ రోల్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.

Exit mobile version