అయ్యబాబోయ్‌… అందరూ అనుష్క మీదనే కన్నేశారు!

Anushka-no-changeఅందాల ముద్దుగుమ్మ అనుష్క కేవలం గ్లామర్‌ పాత్రలనే కాకుండా వైవిధ్యభరితమైన పాత్రలను చేయడానికి చాలా ఆసక్తి చూపుతుంది. ఈ అమ్మడు తన పాత్రలో ఒదిగిపోవడానికి ఎంతటి కష్టం అయినా సరే భరిస్తుంది. అనుష్క ఒక పాత్ర పోషిస్తుందంటే ఆ పాత్ర నిజంగా ఉంటే అది ఇలాగే ఉంటుందా అన్నట్టుగా ఆ పాత్రలో జీవించేస్తుంది. అలాంటి అనుష్క మొదటి నుండి కూడా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే చేస్తూ వస్తుంది. ఈ అమ్మడు కాస్త ఒళ్లు చేసినా కూడా వరుస చిత్రాలలో చాలా బిజీ అయ్యింది. ఎన్నో సక్సెస్‌లు సొంతం చేసుకున్న అనుష్క బాలీవుడ్‌కు ఇంతవరకు వెళ్లే ప్రయత్నయే చేయడం లేదు. ‘బాహుబలి’ చిత్రంలో అనుష్కను చూసిన హిందీ దర్శకనిర్మాతలు అనుష్క అందానికి ఫిదా అయ్యారు. ఇలాంటి ముద్దుగుమ్మ హిందీలో లేనే లేదు అని, ఈమెను బాలీవుడ్‌కు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

‘బాహుబలి’ చిత్రంలో, ప్రమోషన్‌ కార్యక్రమాల్లో అనుష్కను చూసిన బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు ఎలాగైనా అనుష్కను తమ చిత్రాలలో నటింపజేయాలని అనుకుంటున్నారు. ఇకపోతే పారితోషికాన్ని కూడా భారీగానే ఆఫర్‌ చేస్తున్నారు. తమ ప్రాజెక్ట్‌ల గురించి అనుష్కకు ఎప్పటి నుండో సందేశాలను పంపుతున్నారు. ‘బాహుబలి’ ప్రాజెక్ట్‌ మొత్తం పూర్తి అయ్యాక ఇతర చిత్రాలకు ఒకే చెప్పాలని అనుష్క ఇంతకాలం కొత్త చిత్రాలకు చెప్పలేదు. మరీ ‘బాహుబలి 2’ చిత్రం రేపు విడుదల కాబోతుంది. ఇక తదుపరి చిత్రాలకు అనుష్క సైన్‌ చేస్తుందా అని టాలీవుడ్‌, బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఇటు తెలుగు, అటు హిందీ మరియు ఇతర భాషల్లోని చాలామంది యూనిట్‌ సభ్యులు అనుష్క మీద కన్నేశారు. ఇక అనుష్క వేటికి సైన్‌ చేస్తుందో మరి.