Site icon TeluguMirchi.com

నోరు చేసుకోవాలని అనుష్క సరదా !

Heroines-want-their-voice-heard-Anushka-Mirchi-తెలుగులో డబ్బింగ్ చెప్పే హీరోయిన్ల సంఖ్య గతంతో పోలిస్తే చాలా తక్కువ. దాదాపు లేరనే చెప్పవచ్చు. మరీ బాంబే హీరోయిన్ల దిగుమతి బాగా పెరిగింతరువాత అందరు హీరోయిన్లు డబ్బింగ్ మీదనే ఆధార పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటివలి కాలంలో నయనతార తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పి చాలామందికి ఆదర్శంగా నిలిచింది. తనకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలన్నది నయన చిరకాల కోర్కె. ఆ కోరికను చాలాకాలం పాటు అణచుకుని ఎట్టకేలకు ” కృష్ణం వందే జగద్గురుం ” సినిమాతో నెరవేర్చుకుంది. అలాంటి కోరికనే అణచుకుంటున్న మరో హీరోయిన్ అనుష్క. నటిగా తన సత్తా ఏమిటో ఇప్ల్పటికే నిరూపించుకున్న అనుష్క తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకునేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తోంది.

ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క “రాణి రుద్రమదేవి” చిత్రం లో నటిస్తోంది. అలాగే రాజమౌళి దర్సకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా రూపు దిద్దుకుంటున్న ‘బాహుబలి’ చిత్రం లో కూడా అనుష్కే కథానాయకి. తన మనసులోని మాటను రాజమౌళి కి చెప్పిన అనుష్కకు అవతలివైపు నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. ఇంత భారీ చిత్రంలో ఇటువంటి ప్రయోగాలు చేస్తే…. పొరబాటున అవి బెడిసి కొడితే తరువాత బాధ పాడేందుకు కూడా అవకాశం వుండదనుకున్నాడో, ఏమో రాజమౌళి అనుష్క కోరిక విని మిన్నకుండి పోయాడు.

అయితే తాను హీరోయిన్ గా నటిస్తున్న సెల్వ రాఘవన్ తమిళ సినిమా తెలుగు అనువాదంలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని తన సత్తా ఏమిటో రాజమౌళి కి తెలియచేయాలని అనుష్క భావిస్తున్నట్టు భోగట్టా. ఏమయినా తన పాత్రకు తనే నోరు చేసుకునేందుకు తాపత్రయ పడుతున్న అనుష్క  స్పోర్టివిటిని అభినందించాల్సిందే. అల్ థి బెస్ట్ మై డియర్ జేజెమ్మ !!

Exit mobile version